coronavirus-telugu

కరోనా వైరస్ జాగ్రత్తలు

కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది . ముఖ్యంగా కరోనా వ్యాధిలక్షణాలతో చాలా మంది ని గుర్తించడం మరియు వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు . ఈ వ్యాధి తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుగు రాష్టాలపైనా కూడా పెరుగుతుంది. ఈ వైరస్ భారిన పడకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు వ్యాధిలక్షణాల గురించి తెలుసుకొని జాగ్రత్త పడదాం.

 

కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు సాధారణం గా వ్యాధి తీవ్రతను బట్టి పెరుగుతూ ఉంటాయి . వ్యాధి లక్షణాలు :

1.జలుబు

2.జ్వరం

3.దగ్గు

4.తలనొప్పి

5.అలసటగా ఉండటం

పైన పేర్కొన్న లక్షణాలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు:
  1. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి చేతి రుమాలు లేదా నాప్కిన్ అడ్డుపెట్టుకోవాలి
  2. వీలైనంతవరకు బైటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి
  3. కుటుంభం సంభ్యులతో ఎక్కువగా కలిసి ఉండకుండా వీలైనంత దూరం పాటించాలి

వ్యాధి లక్షణాల తీవ్రత పెరుగుతుంటే వెంటనే దగ్గరలో ఉన్న ఐసోలేషన్ కేంద్రానికి వెళ్ళాలి.

 

కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు :
  1. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఏ వ్యాధి సంక్రమిస్తుంది, కనుక వీలైనంత దూరం పాటించడం శ్రేయస్కరం.
  2. కరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఆ తుంపర్ల ద్వారా వైరస్ సంక్రమిస్తుంది. – కనుక తుమ్మినప్పుడు , దగ్గినప్పుడు చేతిరుమాలు లేదా నాప్కిన్ అడ్డుపెట్టుకోవడం ద్వారా ఏ వ్యాధి సంక్రమణను అరికట్టవచ్చు.
  3. వైరస్ ఉన్న వ్యక్తి నోటినుండి వచ్చిన తుంపరలు ఏదైనా వస్తువుపై పడిన , ఆ వస్తువుని ఆరోగ్యమైన వ్యక్తి తాకడం ద్వారకుడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. – కనుక వీలైనంత వరకు ఏదైనా వస్తువుని తాకిన చేతులతో ముఖాన్ని, నోటిని మరియు ముక్కుని తాకడం వంటివి చేయకూడదు.

 

కరోనా వైరస్ భారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు:
  1. చేతులను వీలైనన్ని సార్లు సబ్బుతో లేదా శానిటైజర్ లిక్విడ్ తో కడుక్కోవాలి
  2. మొహాన్ని, నోటిని మరియు ముక్కుని చేతులతో తాకడం వీలైనంతగా తగ్గించాలి.
  3. జ్వరం, దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండడం మంచిది
  4. షేక్ హ్యాండ్ ఇవ్వడం మరియు స్పర్శతో కూడిన ఎటువంటి పలకరింపులైన తగ్గించడం మంచిది.
  5. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంచరించకుండా జాగ్రత్తలు వహించడం మంచిది.

 

కరోనా వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి వైద్యులు చేస్తున్న సూచనలు:
  1. శారీరక పరీక్షలు
  2. రక్త పరీక్షలు
  3. కఫం మరియు శ్వాస సంభందిత సమస్యల నిర్ధారణ పరీక్షలు
కరోనా వైరస్ వ్యాధి చికిత్సలు:

కరోనా వైరస్ కి కచ్చితమైన చికిత్స విధానాలు అందుబాటులో లేనప్పటికీ, క్రింద పేర్కొన్న మార్గాల ద్వారా వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు,

  1. రోగికి జ్వరం మరియు దగ్గు, జలుబు సంభందిత మెడిసిన్ ఇవ్వడం
  2. వీలైనంత ఎక్కువ సమయం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం
  3. వీలైనంత ఎక్కువగా నీటిని సేవించడం
0 Comment

Leave a Comment

Your email address will not be published.